హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

BHPL: మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను కాళేశ్వరం జోన్–1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దుల్లో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు.