హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్ద అంబర్ పేటలో నల్లబెల్లం సీజ్

HYD: బీదర్ నుంచి నల్లగొండకు అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కేజీల నల్లబెల్లాన్ని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పెద్ద అంబర్‌పేట వద్ద స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేసి బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. భానోత్ శీను(39)ని అరెస్ట్ చేసి, స్కార్పియోను సీజ్ చేశారు. బెల్లాన్ని పెద్ద అంబర్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.