JN: మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జనగామ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ మాట్లాడుతూ.. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహాత్మా జ్యోతిబా పూలేకు ఘన నివాళి


