హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా ఆరాధన ఉత్సవాలు

NRPT: నారాయణపేటలో అవధూత నరసింహ స్వామి 135వ సంజీవని సమాధి ఆరాధన ఉత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. మఠం కమిటీ ఆధ్వర్యంలో ఉదయం పాదుక పూజ, రుద్రాభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం పల్లకి సేవ, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిస్వార్థ సమాజ సేవ అందించిన 9 మందిని ఘనంగా సత్కరించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.