హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వడ్లు కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

MDK: చిలిప్‌చేడు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిపుర, జగంపేట రైతులు జోగిపేట-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్లను వెంటనే కొనుగోలు చేసి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ సర్పంచ్ నరేందర్, రామా గౌడ్, నరోత్తం రెడ్డి, నాగేశ్ గౌడ్, పాండు గౌడ్, రైతులు పాల్గొన్నారు.