హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాత్మా పూలేకు బండి రమేష్ ఘన నివాళి

MDCL: కూకట్‌పల్లి నియోజకవర్గం, ఖైతలపూర్ డివిజన్ అంజయ్య నగర్‌లో బాసెట్టి నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతికి టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, సమానత్వం, మహిళా సాధికారతకు పూలే చేసిన సేవలు ఆదర్శమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.