హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల మైదానంలో ప్రమాదకరంగా గుంతలు

NLG: పెద్దవూర మండలం పోతునూరు మండల పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో తవ్విన గుంతలు విద్యార్థులకు ప్రమాదకరంగా మారాయి. గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం ఏడాది క్రితం జేసీబీతో తవ్విన గుంతలను ఇప్పటికీ పూడ్చలేదు. పనులు ప్రారంభించకపోవడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.