హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగ్గురు ఆడపిల్లలను సంపులోకి తోసేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

RR: కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన తల్లి ముగ్గురు ఆడపిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.