హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీలో కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఒక అకౌంటెంట్, ఒక ఏఎన్‌ఎం పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన స్థానిక మహిళలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని డీఈవో విజయసాగర్ తెలిపారు. ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుందని సూచించారు. అధికారిక వివరాలు జిల్లా వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కోన్నారు.