MDK: నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అకాల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ రైతులకు ధాన్యం కప్పేందుకు టార్పాలిన్లు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కొరత


