MHBD: పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ బయ్యారం మండలంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు శనివారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశాయి. పలుమార్లు జాప్యం చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సంఘాల నాయకులు పేర్కొన్నారు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, కనీసం నూతన సంవత్సరం సందర్భంగానైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
PRC అమలు చేయాలని MROకు వినతి


