హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులు సీజ్

BHNG: బీబీనగర్ ఎయిమ్స్‌లోని జన ఔషధి, అమృత్ ఫార్మసీల్లో అనర్హులతో మందుల విక్రయాలపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అశ్విన్‌కుమార్ ఆయా ఫార్మసీలతో పాటు రంగాపురం సమీపంలోని మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫార్మసిస్టులు లేకుండా దుకాణాలు నడిపితే సీజ్ చేయడంతో పాటు డ్రగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.