హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కేంద్రంలో ఘనంగా యువజనోత్సవాలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన యువజనోత్సవాలు అలరించాయి. ఉత్సవాలను పురస్కరించుకుని యువతకు, విద్యార్థులకు నృత్య ప్రదర్శన, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు, ఇతర అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు చేసిన నృత్యం అలరించింది. పలు శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.