KMM: సత్తుపల్లి మండలం గంగారం- కొమరం భీమ్ గ్రామాల మధ్య గల గిరిజన భూములకు అధికారులు కంచె వేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సర్వే నంబర్ 40లో గిరిజన సొసైటీ వారు ఆక్రమించిన 12 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారులు కంచె వేసేందుకు వెళ్లారు. అధికారులను గ్రామస్థులు అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కొందరిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఉద్రిక్తత... అధికారులు అడ్డుకున్న గ్రామస్థులు


