నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ సమీక్ష నిర్వహించారు. అక్రమ రవాణాపై నిఘా ఉంచి అవసరమైతే పోలీసుల సహకారంతో వాహనాలు జప్తు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి: కలెక్టర్


