SRPT: జిల్లాలో వాహనాలకు వివిధ రకాల స్టిక్కర్లు అంటించాలంటూ బలవంతంగా డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం ఈరోజు హెచ్చరించారు. అనుమతులు లేకుండా రహదారులపై వాహనాలను అడ్డుకొని వసూళ్లకు పాల్పడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వాహనదారులు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
స్టిక్కర్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు


