హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగురు కొడుకులు ఇంటి నుంచి గెంటేశారు..!

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అజ్మీరా మురళి (61), సుశీల (60) అనే వృద్ధ దంపతులను వారి ఐదుగురు కుమారులు పోషణ, వైద్య ఖర్చులు ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. దుబాయ్‌లో కష్టపడి సంపాదించిన డబ్బుతో కుమారులకు ఐదు బంగ్లాలు నిర్మించి ఇచ్చానని, వృద్ధాప్యంలో తమను పట్టించుకోవడం లేదని మురళి ఆవేదన వ్యక్తం చేశారు.