హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగురికి రూ.5.60 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని అనారోగ్య బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) పంపిణీ చేశారు. కొత్తకోట, అడ్డాకుల మండలాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.5.60 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.