హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు

KMR: రోడ్డు ప్రమాదాల నివారణకు కేటాయించిన రూ.కోటి నిధులను ప్రాధాన్యతా పనులకు వినియోగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఓవర్‌లోడ్ ఆటోలపై తనిఖీలు,అనుమతులు లేని దాబాలపై చర్యలు తీసుకోవాలని,వీధి కుక్కల వల్ల ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర, ఆర్‌అండ్‌బీ ఈఈ అంజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.