హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఎస్పీ కీలక సూచనలు

MBNR: జిల్లాలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు అభ్యర్థులు నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ డి. జానకి సూచించారు. పరీక్షా కేంద్రం గేట్లు మూశాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమన్నారు. హాల్ టికెట్‌పై ఫొటో, ఐడీ కార్డు, బ్లూ బాల్ పెన్ మాత్రమే తేవాలని, మొబైల్స్, వాచ్‌లు, బ్యాగులు, చేతులకు మెహందీ, టాటూలకు అనుమతి లేదన్నారు.