SRPT: పాలకవీడు మండలం హనుమయ్యగూడెం గ్రామంలో ఈరోజు వడిత్యా హుస్సేన్ (60) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తలపై, శరీరంపై తీవ్ర గాయాలు కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి?


