హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్ష పత్రాలు ఆవిష్కరణ

NRPT: నారాయణపేట పట్టణంలోని గ్రౌండ్ స్కూల్‌లో జన విజ్ఞాన వేదిక, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలను ట్రైనీ డీఎస్పీలు శ్రీనికేష్ నాయక్, దైనంపల్లి ప్రవీణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.