హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిసెంబర్ 4న విండో సర్వసభ్య సమావేశం'

GDWL: డిసెంబర్ 4న సింగిల్ విండో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు అయిజ సింగిల్ విండో ఛైర్‌పర్సన్ సుజాత తెలిపారు. శనివారం విండో కార్యాలయంలో డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతన విండో కార్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మండలంలోని చిన్న తాండ్రపాడు మరో సింగిల్ విండోగా ఆవిర్భవించనుందని ఆమె వెల్లడించారు.