JGL: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకట్రావుపేటకు చెందిన వర్ల మహేశ్ కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ మహేశ్ నేత్రాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా మహేశ్ భార్య, కుటుంబ సభ్యులను డాక్టర్ శ్రీనివాస్, నాగరాజు అభినందించారు.
తెలంగాణ
కన్నీటి మధ్య వెలుగులు పంచిన కుటుంబం


