హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలపై అవగాహన

WNP: భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు, ఎయిర్‌మెన్ ఉద్యోగ అవకాశాలపై డిసెంబర్ 5న వనపర్తి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొబైల్ థియేటర్ వ్యాన్ ద్వారా అర్హతలు, ఎంపిక విధానంపై వివరించనున్నారు. ఆసక్తి ఉన్న యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.