హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజన్న కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి'

SRCL: వేములవాడలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ.. రాజన్న ఆలయంలో కోడె మొక్కుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా కోడెల సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల్లో వెటర్నరీ వైద్యులను నియమించి ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.