హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణకు చర్యలు

JN: లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల బ్రిడ్జి వద్ద బాటిల్ నెక్ సమస్య పరిష్కారంతో పాటు రహదారి విస్తరణ, కల్వర్టు విస్తరణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి బ్రిడ్జిని పరిశీలించి మాట్లాడారు. ప్రమాదాల నివారణకు క్రాష్ బ్యారియర్లు, రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.