PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇవాళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన మృతితో భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


