MDK: నిజాంపేట మండలం నగరం తండాలో శనివారం MRO శ్రీనివాస్, SI రాజేష్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్లాసుల పద్ధతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలు, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను రూపుమాపి, సమానత్వ భావనతో మెలగాలని సూచించారు. ఇందులో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


