హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

RR: మణికొండ క్వార్టర్స్‌లో అయ్యప్ప పూజ ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఉదయ్ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సాయి అనే వ్యక్తి గాయపడగా, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.