హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ భూముల్లో నిర్మించిన గుడిసెల తొలగింపు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం బొంగుల కింది తండాలో అటవీ భూముల్లో నిర్మించిన గుడిసెలను అధికారులు తొలగించారు. డిప్యూటీ FRO ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. పశువుల కోసం 20 ఏళ్లుగా గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని తండావాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, అక్రమణాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.