HYD: అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. జనవరి 2 నుంచి 23 వరకు ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి, జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం కొల్లాం నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్టులు కల్పించారు.
తెలంగాణ
హైదరాబాద్ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లు


