హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలకు భద్రత'

NRML: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలకు భద్రత ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం లక్ష్మీచంద్ర మండలం చామనపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన 13 సీసీ కెమెరాలు వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులను వారు అభినందించారు. గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.