హైదరాబాద్: 28°C
తెలంగాణ

21 మంది గీత కార్మికులకు చేయూత పింఛన్లు

HNK: పరకాల మండలం కంటాత్మకూర్ గ్రామంలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లతో 21 మంది గీత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 51 మందికి పింఛన్లు మంజూరయ్యాయని సర్పంచ్ తిరుపతి తెలిపారు. MLA రేవూరి ప్రకాశ్ రెడ్డికి, సర్పంచ్‌కు గౌడ సంఘం నాయకులు, లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.