హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక సమానత్వానికి పూలే ఆశయాలే స్ఫూర్తి

SDPT: అణగారిన వర్గాలకు విద్యా హక్కులు కల్పించి, సమాజంలో సమానత్వం కోసం పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయమని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా చిన్నకోడూర్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు.