VKB: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 53 గ్రామాల్లో 102 బాల్య వివాహాలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
తెలంగాణ
వికారాబాద్ జిల్లాలో 102 బాల్య వివాహాలకు చెక్


