BHPL: రేగొండ పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP సంకీర్త్ గౌడ్ శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. నేరాల కట్టడికి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను కాపాడాలన్నారు.
తెలంగాణ
రేగొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


