హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూలే దంపతుల విగ్రహాలకు ఘన నివాళులు

SRCL: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయాలైన విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.