SRD: కంగ్టి మండలం తడ్కల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యదర్శి జ్ఞాన్ దేవ్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా కుటుంబాలకు అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
తెలంగాణ
జీవిత బీమా పథకం ప్రారంభం


