హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు దాటే క్రమంలో కారు ఢీ కొని మహిళ మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేనవేణి మల్లక్క (60) అనే వృద్ధురాలు మృతి చెందింది. కంటి పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన ఆమె, రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితులు వాహనాన్ని వదిలేసి పరారవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.