హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొలి పింఛన్తో తోటి విద్యార్థులకు చేయూత

VKB: చెల్లాపూర్‌కు చెందిన ప్రాథమిక పాఠశాల విద్యార్థి దనగళ్ల చందు తనకు అందిన తొలి పింఛన్ రూ.4,016ను తోటి విద్యార్థుల కోసం ఖర్చు చేశాడు. ఆ డబ్బుతో వారికి నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశాడు. ప్రధానోపాధ్యాయుడు తుప్పలి ఆనంద్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి ఔదార్యాన్ని ఉపాధ్యాయులు అభినందించి, తండ్రి నరేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.