హైదరాబాద్: 28°C
తెలంగాణ

​అంగన్వాడీ దారి గేటు తాళం తొలగింపు

BHNG:  భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రం-1కు వెళ్లే ప్రధాన గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు.​ గత రెండు నెలలుగా గాంధీ విగ్రహం వైపు ఉన్న గేటుకు తాళం వేసి ఉండటంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాల రద్దీ ఉండే జూనియర్ కాలేజీ వైపు గేటు నుండి చుట్టూ తిరిగి అంగన్వాడీ కేంద్రానికి రావాల్సి వచ్చేది.