హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం: హరి ప్రసాద్

MHBD: తొర్రూరు మండలం జమస్తాన్ పురం శివారు సుందర్ నాయక్ తండాలో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను పీఎసీఎస్ ఛైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి, పీఎసీఎస్ ఛైర్మన్ హరిప్రసాద్‌లకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.