హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీ.కే తండాలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

WGL: టీ.కే తండా గ్రామ పంచాయతీలో సీఎం రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు గ్రామ ప్రజలు పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు ఆసరా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నందకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాలోత్ శ్రీనివాస్, అనిల్ నాయక్, ఉప సర్పంచ్ లత, గ్రామస్తులు బద్రు, మంగూలాల్, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.