హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్మార్ట్ మొబిలిటీపై విద్యార్థులకు అవగాహన

HYD: "సైబరాబాద్ మూవ్స్ 2026' మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కెన్నెడీ పాఠశాల విద్యార్థులు నేడు టీ-హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా, సైక్లింగ్, నడక ప్రాముఖ్యతను వారు తెలుసుకున్నారు. స్మార్ట్, గ్రీన్ మొబిలిటీ విధానాల ద్వారా హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా ఎలా మార్చవచ్చో విద్యార్థులు అవగాహన పెంచుకున్నారు.