హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేరుకే ఫేమస్.. ఆహారం మాత్రం కుళ్లినదే!

HYD: నగరంలోని ఫేమస్ రెస్టారెంట్ల తీరు చూస్తుంటే 'దొరికితే దొంగ.. లేదంటే దొర' అన్నట్లుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు బయటపడుతున్నాయి. తనిఖీలు లేకపోతే అవే పాడైన ఆహారాన్ని ప్రజలకు అంటగట్టేస్తున్నారు. కనీస శుభ్రత లేకుండా ప్రజారోగ్యంతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసం? వ్యాపారులు తీరు మార్చుకుని నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది.