హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667 ఉండగా, శనివారం ప్రైవేటు మార్కెట్లో గరిష్ఠంగా రూ.9,225 పలికింది. శుక్రవారం ధర రూ.9,175 ఉండగా, శనివారం రూ.50 పెరిగి క్వింటాల్‌కు రూ.9,225తో రికార్డు ధర పలికింది. నాణ్యమైన పత్తికి డిమాండ్ ఉందని, రైతులు ధరలను గమనించి తేవాలని అధికారులు సూచించారు.