హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రసాదాల ధరల పెంపునకు ప్రతిపాదన

BDK: పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా భద్రాచలం దేవస్థానంలో ప్రసాదాల ధరలు పెంచేందుకు ప్రతిపాదించారు. చిన్న లడ్డూ రూ.30 (గతంలో రూ.25), మహా లడ్డూ రూ.125 (రూ.100), పులిహోర, చక్కెరపొంగలి రూ.20 (రూ.15), బెల్లం రవ్వకేసరి రూ.25 (రూ.20)కి సవరించనున్నారు. వీటిపై భక్తులు 15 రోజుల్లోగా లిఖితపూర్వక అభ్యంతరాలు తెలపాలని శనివారం ఈవో దామోదర్‌ రావు కోరారు.