SRPT: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష, అసమానతల నిర్మూలనకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి'


