NRML: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కడెం మండలంలోని చిన్న బెల్లాల్ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న అన్నారు. శనివారం నర్సింగపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించేయాలన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


